Menu


 లక్కీ హీరోగా యూత్‌ఫుల్‌ కామెడీ చిత్రం
సినిమాలపై ఆసక్తి వున్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదల వున్న ఈ యువహీరో పేరు లక్కీ. ఈ లక్కీ పుట్టినరోజు 14 ఫిబ్రవరి.  కొన్ని వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుంటూనే, ఇప్పటివరకు 10 సీరియల్స్‌లోను, 15కు పైగా షార్ట్‌ఫిలింస్‌లో నటించాడు. గతంలో లక్కీ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇదిలా వుంటే ‘కరెంట్‌ తీగ’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన రామకృష్ణ దర్శకత్వంలో, ‘అనుక్షణం’ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేస్తున్న ‘చిత్రం’ అనే షార్ట్‌ఫిలింలో హీరోగాను... సుధీర్‌ చౌదరి దర్శకత్వంలో ‘ఓ ప్రియ నిను చూడలేక’ అనే షార్ట్‌ఫిలింలో హీరోగా నటిస్తున్నాడు.  ఇవి కాకుండా కన్నడంలో ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘చిత్రం, ఓ ప్రియా నిను చూడలేక’ షార్ట్‌ఫిలింస్‌ను ఒకేరోజు ఫిబ్రవరి 16న రిలీజ్‌ చేయబోతున్నారు. వీటిని అదేరోజు ప్రసాద్‌ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్నారు. లక్కీ హీరోగా రామకృష్ణ దర్శకత్వంలో యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలను తెలియచేస్తారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్‌ చేసుకున్న ఈ యువహీరో లక్కీ మరిన్ని అవకాశాలను అందుకోవాలని కోరుకుంటూ తనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేద్దాం.

Advertisement

 
Top