
'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఊపిరి'. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు .గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 1న హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, కార్తీ, ప్రకాష్ రాజ్, జయసుధ, కాజల్ అగర్వాల్, పివిపి,వంశీపైడిపల్లి, అశ్వనీదత్, సుశాంత్, హరీష్ శంకర్, అబ్బూరి రవి, రామజోగయ్యశాస్త్రి, దిల్ రాజు, రఘరామరాజు, సుమంత్, గాబ్రియల్, జెమిని కిరణ్, కళ్యాణ్ కృష్ణ, అడవి శేష్, దశరథ్, తదితరులు పాల్గొన్నారు.
బిగ్ ఆడియో సీడీను అక్కినేని అమల విడుదల చేశారు. ఆడియో సీడీలను అక్కినేని నాగార్జున విడుదల చేసి అమలకు తొలి సీడీని అందించారు.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘’నేను సాహసంతో గీతాంజలి, నిన్నేపెళ్ళాడతా, అన్నమయ్య, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలు చేశాను. ‘ఊపిరి’ విషయానికి వస్తే ఇది పెద్ద జర్నీ. నేను, అమల నాలుగేళ్ళ క్రితం ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ‘ఇన్ టచ్ బుల్స్’ చూసి దీన్ని ఎవరైనా తెలుగులో చేస్తే బావుంటుందనుకున్నాం. నేను కూడా యాక్ట్ చేస్తే బావుంటుందని అనుకున్నాను. మనసులో గట్టిగా కోరుకుంటే జరుగుతుందని ఎవరో అన్నట్టు మూడేళ్ళ తర్వాత వంశీ ‘ఇన్ టచ్ బుల్స్’ సీడీ ఇచ్చి సినిమా చూడమన్నాడు. వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో కాళ్ళు,చేతలు పడిపోయినా మనసు పరిగెత్తే క్యారెక్టర్ చేశాను. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మనిషికి తోడు ఎంత అవసరమో చెప్పే చిత్రమిది. ఈ సినిమా ద్వారా కార్తీ లాంటి ఫ్రెండ్, తమ్ముడు దొరికాడు. అలాగే నిర్మాత పివిపిగారు ఈ సినిమాకు మరో ఊపిరి. శివ, గీతాంజలి, అన్నమయ్య సినిమాకు వచ్చినంత మంచి పేరు ఈ సినిమాకు వస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
‘ఆవారా’ కార్తీ మాట్లాడుతూ ‘నాగార్జునగారు ఈ సినిమాలో నటిస్తున్నారనగానే ఈ సినిమాలో నటించడానికి డబుల్ ఓకే చెప్పాను. ఆయనతో నటించడం లైఫ్ లాంగ్ గిఫ్ట్ దొరికినట్టయింది. బెస్ట్ ఇవ్వాలని అందరూ ప్రయత్నించాం. వంశీ మనకు తగినట్టుగా సినిమాను చక్కగా చేంజస్ చేసి చేశాడు. సెన్సిబిలిటీ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా ఇంత బాగా వచ్చినందకు పివిపిగారు ముఖ్య కారణం. గోపీ సుందర్ గారు బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. రేపు ఆడియెన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
పివిపి మాట్లాడుతూ ‘’నాగార్జున, కార్తీలే ఈ సినిమాకు ఊపిరి. ఎంతో సపోర్ట్ చేశారు. వారితో సహా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘’నాగార్జున, కార్తీ, పివిపి, తమన్నా అందరినీ చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను. వారి వ్యక్తిత్వాలే ఈ సినిమా చేయడానికి కారణమైంది. మన మనసు, అనుభవం, అనుబంధాలతో చూడాల్సిన సినిమాయే ఇది’’ అన్నారు.
వంశీపైడిపల్లి మాట్లాడుతూ ‘’ఈ సినిమా రూపొందడానికి కారణం నాగార్జున, కార్తీ, పివిపిగారే. పివిపిగారు నన్ను ఎంకరజ్ చేసిన తీరు, ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని చూస్తే భయమేసింది. ఇట్ ఈజ్ బ్రీత్ ఆఫ్ రిలీఫ్. నాగార్జునగారు ఒక ఊపిరి అయితే మరో ఊపిరి కార్తీగారు. మ్యాజిక్ లేయర్ లాంటి నాగార్జున, కార్తీగారు లేకుంటే ఊపిరి సినిమాయే లేదు. హరి, సాల్మన్, అబ్బూరి రవిల సపోర్ట్ కూడా ఎంతో ఉంది. గోపీ సుందర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆద్యంతం నవ్విస్తూనే ఆయన తప్ప మరెవరూ చేయలేరనే విధంగా నటించారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ మాట్లాడుతూ ‘’ఊపిరి సూపర్ హిట్ చిత్రమవుతుంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.
కింగ్ నాగార్జున, 'ఆవారా' కార్తీ, తమన్నా భాటియా, సహజనటి జయసుధ, ప్రకాష్‌రాజ్, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: మధు, ఫైట్స్: కలోయిన్ ఒదెనిచరోవ్, కె.రవివర్మ, సిల్వ, డాన్స్: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్: వంశీ పైడిపల్లి, సాల్మన్, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.