MTM Ugadi Sambaralu ,Maharastra Telugu Manch,Ugadi Puraskaralu 2016,tollywood stars,Musical Night,dr Konejeti Rosaiah,srikanth actor,rajendraprasad actor,shivaji raja,naresh,suresh Kondeti,hon'ble Governer of tamilnadu

మహారాష్ట తెలుగు మంచ్ ఆధ్వర్యంలో ఈ యేడాది ఉగాది సంబరాలు ముంబైలో ఘనంగా జరుగబో తున్నాయి. ఏప్రిల్ 3వ తేదీ ఆదివారం ఉదయం 10.00 గంటలకు బాంద్రా లోని రంగ్ శారదా ఆడిటోరియంలో ఈ వేడుక జరుగబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్. విద్యాసాగర్ రావు, తమిళనాడు గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య ముఖ్యఅతిథిలుగా పాల్గొనబోతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా సీనియర్ కళాకారులకు ఇతోధిక సేవ చేస్తున్న అధ్యక్ష కార్యదర్శులు రాజేంద్ర ప్రసాద్, శివాజీరాజాను ఈ వేదికపై సత్కరించబోతున్నారు. అలానే శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్, ఇటీవలే డాక్టరేట్ ను అందుకున్న సీనియర్ నటుడు నరేశ్, భారతీయ చిత్రసీమ గర్వపడే అపురూప చిత్రాలను రూపొందించిన స్వర్గీయ ఏడిద నాగేశ్వరరావు తనయుడు ఏడిద శ్రీరామ్ ను కూడా సన్మానిస్తారు. ఈ కార్యక్రమానికి ‘సంతోషం’ పత్రికాధినేత, నిర్మాత సురేశ్ కొండేటి సైతం ఆత్మీయ అతిథిగా హాజరు కాబోతున్నారు. ‘పెళ్ళైన కొత్తలో’ ఫేమ్ అగస్త్య ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమం కూడా జరగబోతోంది.