April 17, 2025 04:11:02 PM Menu

   

      ఒకేరోజు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ సినిమాల కథలు ఓకే చేయించుకున్న పూరి జగన్నాథ్‌.
         డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఒకేరోజు ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు కథలు చెప్పి ఓకే చేయించుకున్నారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి ఒక కథ, డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌కి ఒక కథ చెప్పి.. ఈ రెండు కథల్ని ఒకేరోజు ఓకే చేయించుకున్నారు పూరి జగన్నాథ్‌. సాధారణంగా ఐదారు కథలు చెప్పి 20, 30 సిట్టింగ్స్‌ వేస్తేగానీ కథలు ఓకే అవ్వని ఈరోజుల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు వేర్వేరుగా కథలు చెప్పి ఒకే సిట్టింగ్‌లో ఓకే చేయించడం పూరి వల్లే సాధ్యమేంది. ఈ అరుదైన రికార్డ్‌ను సాధించిన పూరి జగన్నాథ్‌కి హ్యాట్సాఫ్‌ చెప్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కళ్యాణ్‌రామ్‌ కాంబినేషన్‌లో పూరి జగన్నాథ్‌ చెయ్యబోతున్న సినిమాను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో ఏప్రిల్‌ నుంచి స్టార్ట్‌ చేస్తున్నారన్న విషయం ఆల్రెడీ కన్‌ఫర్మ్‌ అయిపోయింది. ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో పూరి జగన్నాథ్‌ చెయ్యబోయే సినిమాను ఏ బేనర్‌లో చెయ్యబోతున్నారు, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందనే విషయాలు తెలియాల్సి వుంది.

Advertisement

 
Top