Menu


సంక్రాంతి కింగ్‌ నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా'కు నైజాంలో 55 థియేటర్లు పెంపు కింగ్‌ నాగార్జున ద్విపాత్రాభినయం చేసి కళ్యాణ్‌కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌పై నిర్మించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సంక్రాంతికి విడుదలై అద్భుత విజయాన్ని సాధించి సంక్రాంతి చిత్రాల్లో నెంబర్‌ 1గా నిలిచినందుకు చాలా హ్యాపీగా వుందంటూ సోగ్గాడే బయ్యర్లందరూ సంక్రాంతి కింగ్‌ నాగార్జునకు అభినందనలు తెలుపుతున్నారు. 450 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని ఈనెల 22 నుండి మరో 150 స్క్రీన్స్‌ పెంచి 600 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. నైజాంలో కేవలం 120 థియేటర్లలోనే విడుదలై 6 రోజుల్లోనే 5 కోట్ల 20 లక్షలకు పైగా షేర్‌ సాధించి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు 22 నుండి మరో 55 థియేటర్లు పెంచుతున్నట్లు నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేసిన ఏషియన్‌ సునీల్‌ చెప్పారు. ఫస్ట్‌ వీక్‌లో తక్కువ స్క్రీన్స్‌లోనే రికార్డ్‌ షేర్స్‌ సాధించిన సోగ్గాడు సెకండ్‌ వీక్‌లో ఇంకా పెద్ద రేంజ్‌కు వెళ్తోంది. ''సంక్రాంతికి వస్తాం. సూపర్‌హిట్‌ కొడతాం'' అని ఆడియో ఫంక్షన్‌లో అభిమానులతో చెప్పినట్టుగానే చెప్పి మరీ రికార్ట్‌ బ్రేకింగ్‌ హిట్‌ ఇచ్చారు కింగ్‌ నాగార్జున. ఒంగోలులో 'సోగ్గాడి' రికార్డ్‌! ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్‌లో ఫస్ట్‌వీక్‌లోనే 29 లక్షల 37 వేలు గ్రాస్‌ కలెక్ట్‌ చేసి సింగిల్‌ థియేటర్‌ రికార్డ్‌ సృష్టించింది సంక్రాంతి కింగ్‌ నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా'.

Advertisement

 
Top