‘పడేసావే’ సాంగ్ రిలీజ్ అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, సామ్ హీరోహీరోయిన్లుగా చునియా దర్శకత్వంలో చనియా దర్శకత్వంలో అయాన్ ప్రొడక్షన్స్ రూపొందుతోన్న చిత్రం పడేసావే. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ పాడిన సాంగ్ ను శనివారం రేడియో మిర్చిలో రిలీజ్ చేశారు.
ఈ సందర్బంగా...
చునియా మాట్లాడుతూ ‘’టిపికల్ సిచ్యువేషనల్ సాంగ్. ఈ సిచ్యువేషన్ తెలియగానే అనూప్ అలీతో పాడించాడు. ఫన్నీగా, కామెడి సెన్స్ తో సాగే పాట ఇది. బాగా వచ్చింది’’ అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ ‘’కామిక్ సిచ్యువేషన్ లో వచ్చే పాట ఇది. ఆలీ నటించడమే కాకుండా పాటను చాలా బాగా పాడారు. ఆడియో 26న విడుదలవుతుంది. అందరూ పాటల్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘’హిలేరియస్ సాంగ్, బాగా వచ్చింది. మంచి మ్యూజిక్ కుదిరింది. చునియాగారు బాగా పిక్చరైజ్ చేశారు. అలీ గారికి థాంక్స్’’ అన్నారు.
నిత్యాశెట్టి మాట్లాడుతూ ‘’మంచి కామెడి సాంగ్. చునియాగారికి, అలీ గారికి థాంక్స్. అనూప్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 26న ఆడియో విడుదల అవుతుంది’’ అన్నారు.
