Menu




సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నూతన చిత్రం ‘శరభ’ సంక్రాంతి సందర్భంగా జనవరి 15న లాంచనంగా ప్రారంభమైది. చలన చిత్ర రంగంలో ఎన్నడూ జరగని రీతిలో 108 నరసింహ స్వామి పుణ్య క్షేత్రాల్లో ఒకే సమయంలో సాంకేతిక, నటీనట వర్గం చేతుల మీదుగా ఈ భారీ చిత్రం ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద జెంటిల్ మేన్ చిత్రం నుండి 20 సంవత్సరాల పాటు కోడైరెక్టర్ గా వర్క్ చేసిన నరసింహారావు.ఎన్ దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహాదేవ్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా... నిర్మాత అశ్వనీ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ ‘’దర్శకుడు చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించడంతో సినిమాను స్టార్ట్ చేశాం. సినిమా జనవరి 21 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. సోషియో ఫాంటసీ చిత్రం. నరసింహ స్వామి చరిత్రంలో రియల్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాను అనుకున్న విధంగా చిత్రీకరించి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు.

దర్శకుడు నరసింహా రావు.ఎన్ మాట్లాడుతూ ‘’మంచి కాన్సెప్ట్. సోషియో ఫాంటసీ చిత్రం. కోటిగారు సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆరు పాటలుంటాయి. మంచి టీం కుదిరింది. ఈ సినిమాకు పనిచేసే ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ సహకారంతో చరిత్రలో ఎక్కడా జరగని విధంగా 108 నరసింహస్వామి ఆలయాల్లో ఈ భారీ సినిమా ప్రారంభమైంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం’’ అన్నారు.

జయప్రద, ఆకాష్ సహదేవ్, మిష్టీ చక్రవర్తి, నెపోలియన్, నాజర్, షాయాజీ షిండే, పునీత్ ఇస్సార్, చరణ్ దీప్, ఎల్.బి.శ్రీరాం, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి, రఘుబాబు, జబర్ దస్త్ రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ, సంగీతం: కోటి, ఆర్ట్: కిరణ్ కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా, నిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.నరసింహారావు.

Advertisement

 
Top