Menu


చెన్నై వరద బాధితులకు మైత్రి మూవీ మేకర్స్‌ రూ.5 లక్షల విరాళం సూపర్‌స్టార్‌ మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని అందించి ప్రస్తుతం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌ చెన్నై వరద బాధితుల సహాయార్థం రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సి.వి.ఎం) తెలిపారు.

Advertisement

 
Top