Menu


చెన్నై వరద బాధితులకు రూ.10 లక్షల విరాళం ప్రకటించిన కృష్ణంరాజు, ప్రభాస్‌ భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 9 జిల్లాలు వరద తాకిడికి గురైన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా చెన్నై పట్టణం ముంపుకు గురి కావడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఎంతో మంది నిరాశ్రయులు కావడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కలిసి వరద బాధితులకు 15 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేస్తారు.

Advertisement

 
Top