Menu



ఘర్షణ, ఏం మాయ చేసావే, వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ సమర్పణలో గురు ఫిలింస్ పతాకంపై మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్‌ఎటాక్, చిన్నదాన నీకోసం వంటి వరుస విజయాలు సాధించిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ ఈ చిత్రంలో కథానాయకుడు. ప్రేమ్‌సాయి దర్శకుడు. యామీ గౌతమ్ కథానాయిక. కాగా ఈ నెల 23న ఈ చిత్ర ఆడియో వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ సందర్భంగా గౌతమ్‌మీనన్ మాట్లాడుతూ ‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రొమాన్స్, యాక్షన్, కామెడి, థ్రిల్లర్ అంశాలు మేళవించిన చిత్రమిది. కొరియర్‌బాయ్‌గా పనిచేసే ఓ యువకుడి జీవితంలో ఎదురైన అనుహ్య సంఘటనలు, వాటి పరిణామాలేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. నితిన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. దర్శకుడు ప్రేమ్‌సాయి చక్కటి భావోద్వేగాలతో చిత్రాన్ని రూపొందించాడు. అనూప్‌రూబెన్స్ సంగీతం, సందీప్‌చౌతా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధానాకర్షణగా వుంటాయి. నితిన్, యామీ గౌతమ్ పెయిర్ ఆడియన్స్‌ను అలరిస్తుంది. దర్శకుడు ప్రేమ్‌సాయి సినిమాను సెన్సిబుల్‌గా తెరకెక్కించాడు. రొమాన్స్, యాక్షన్, కామెడీ థ్రిల్లర్ సహా అన్నీ అంశాలు ఈ చిత్రంలో వుంటాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’

Advertisement

 
Top