Menu



అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్' చిత్రం సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్నారు. మారుతి ద‌ర్శ‌కుడు. బ‌న్నివాసు నిర్మాత‌. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఆడియో కి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టంతో యూనిట్ స‌బ్యులంద‌రూ ఆనందంగా వున్నారు. నేష‌న‌ల్‌ అవార్డ్ గ్ర‌హీత ప్రముఖ సంగీత ద‌ర్శ‌కులు గోపిసుంద‌ర్ సంగీతాన్ని అందించారు. ఈచిత్రానికి సంబందించిన అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి క్వాలిటి విష‌యంలో భారిచిత్రాల‌కు ఏమాత్రం తీసిపోకుండా డాల్బి అట్మాస్ లో ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ: " భలే భలే మగాడివోయ్ విడుద‌లకి సిద్దమైంది. నటించ‌టానికి వీలున్న మంచి పాత్ర చేశాన‌న్న తృప్తివుంది. మారుతి తొ ప‌నిచేయ‌టం హ్య‌పిగా వుంది. లావణ్య త్రిపాఠి మంచి కోస్టార్.అల్లు అర‌వింద్ గారి సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations బ్యాన‌ర్ లో బ‌న్నివాసు నిర్మాత‌గా ఈచిత్రం చేయ‌టం ఇంత క్వాలిటిగా రావ‌టానికి కార‌ణం. తప్ప‌కుండా ఫ్యామిలి అంతా ధియోట‌ర్స్ కి వెళ్ళి చూడాల్సిన చిత్రం. న‌వ్విస్తూనే వుంటాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఆడియో కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. గోపిసుంద‌ర్ కి చాలా మంచి ఆడియో ఇచ్చాడు. సెప్టెంబ‌ర్ 4 న ఈచిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా డాల్బి అట్మాస్ లో విడుద‌ల చేస్తున్నారు " అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ: మా చిత్రం 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' ప్ర‌స్తుంత డి.టి.మ‌స్ కార్య‌క్ర‌మాల్లో వుంది. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ గోపిసుంద‌ర్ అందించిన ఆడియోని స్వాతంత్ర‌దినోత్స‌వం సంధ‌ర్బంగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ చేతుల‌మీదుగా అగ‌ష్టు 15న చేశాము. చాలా పెద్ద విజ‌యం సాదించాయి.. ప్ర‌మోష‌న్ విష‌యంలో కూడా చాలా కేర్ తీసుకుని డిఫ‌రెంట్ గా సినిమాని ప్రెజెంట్ చేస్తున్నాము. నిజార్ కెమెరా వ‌ర్క్‌ సూప‌ర్బ్ గా వుంటుంది. నేను ఏ క‌థ తీసుకున్నా కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో చేస్తాను. ఈ చిత్రం మరింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో చేశాను. క‌థ‌లోనే కామెడి, కేర‌క్ట‌ర్స్ లోనూ కామెడి వుండ‌టంతో చిత్రం ఆద్యంతం న‌వ్వుతూనే వుంటారు. ఈచిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కున్ని ఆక‌ట్టుకునేలా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందింది. డాల్బి అట్మాస్ లో ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల చేస్తున్నాము. అని అన్నారు

నిర్మాత బ‌న్నివాసు మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు మారుతి అనుకున్న‌ది అనుకున్న‌ట్టే తీసాడు. కోత్త‌జోన‌ర్ లో చిత్రాన్ని తెరకెక్కించాడు. నాని చాలా బాగా న‌టించారు. ఆయ‌న కేర‌క్ట‌ర్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఆడియోకి,ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌తిమ‌రుపు కుర్రాడిగా చాలా మంచి వినోదాన్ని అందించారు హీరో నాని గారు. ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ వాల్యూస్ విత్ ఎంట‌ర్టైన్‌మెంట్‌ తో చిత్రీకరించాం. ఫ్యామిలి అంతా న‌వ్వుకునే విధంగా భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం వుంటుంది. ఈ చిత్రాన్ని డాల్బి అట్మాస్ లో సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల చేస్తున్నారు." .అని అన్నారు.
న‌టీన‌టులు..
నాని,లావ‌ణ్య త్రిపాఠి,ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌,సితార‌,స్వ‌ప్న మాధురి,శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌,ప్ర‌వీణ్,ష‌క‌ల‌క శంక‌ర్‌,బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు..
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను,ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌,ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి,సంగీతం: గోపి సుంద‌ర్,నిర్మాత:బ‌న్నివాసు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి

Advertisement

 
Top