Menu

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం' చిత్రాన్ని స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు- నిర్మాత ప్రియాంక ద‌త్‌
యంగ్‌ హీరో నాని తాజా చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. ఉగాది పర్వదినాన ఈ మార్చి 21న విడుదలై సక్సెస్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.  నాని, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా న‌టించారు.  స్వప్న సినిమా బ్యానర్ పై రూపొందింది. ప్రియాంక దత్ నిర్మాత. నాగ్ ఆశ్విన్ దర్శకుడు. ఈ సినిమా విజ‌య‌వంత‌మైన సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ప్రియాంక‌ద‌త్ మాట్లాడుతూ ''మా స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ లో వ‌చ్చిన ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం మంచి టాక్‌తో ర‌న్ అవుతుంది. విడుద‌లైన అన్నీచోట్ల మంచి రిపోర్ట్, మంచి క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళ్తుంది. మా బ్యాన‌ర్‌కి మ‌రో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను అందించిన ప్రేక్ష‌క‌లు ధ‌న్య‌వాదాలు'' అన్నారు.

Advertisement

 
Top