Menu

పాట చిత్రీకరణలో  's/o స‌త్య‌మూర్తి' 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 's/o స‌త్య‌మూర్తి' చిత్ర షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో జరుగుతోంది. అల్లు అర్జున్, సమంత, అదాశర్మపై పాటను చిత్రీకరిస్తున్నారు. అద్భుతమైన సెట్లో చిత్రీకరిస్తున్న ఈ పాటకు జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. దీంతో 's/o స‌త్య‌మూర్తి' చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. మార్చి 15న నోవాటెల్ లో ఈ చిత్ర ఆడియోను, ఏప్రిల్ 2న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.  మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతమందించారు. 
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు. ఇటీవ‌లే స్పైయిన్ లొ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సమంత‌, నిత్యామీన‌న్ పై మూడు పాట‌లు చిత్రీక‌రించారు.
Tags: S/o Satyamurthy, Allu Arjun S/o Satyamurthy, Telugu Movie S/o Satyamurthy, Telugu Cinema S/o Satyamurthy, Allu Arjun in S/o Satyamurthy, Samantha, Adhah Sharma, Trivikram Srinivas.

Advertisement

 
Top