Menu

హైదరాబాద్‌లో పుట్టి పెరిగి అమెరికాలో పారిశ్రామిక వేత్తగా ఎదిగిన మధుసూదనరెడ్డి 2007లో ‘అమెరికన్‌ తెలుగు టి.వి.’ ప్రారంభించారు. అమెరికాలో వుండే తెలుగు వారికి టైమ్‌ అనేది డిఫరెంట్‌గా వుండడం వల్ల వారికి అందుబాటులో వుండే ప్రోగ్రామ్స్‌ చెయ్యడం కష్టమవుతోందని భావించిన మధుసూదనరెడ్డి. అందుకే అమెరికన్‌ తెలుగు టెలివిజన్‌ ఆన్‌ డిమాండ్‌ని ప్రారంభిస్తున్నారు. ఇది పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో నడిచే టి.వి. ఈ టి.వి. ద్వారా ఫుడ్‌ ప్రోగ్రామ్స్‌, కాంటెస్ట్‌లు, షార్ట్‌ ఫిలింస్‌, సీరియల్స్‌.. లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ని టెలికాస్ట్‌ చెయ్యబోతున్నారు. పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా వారికి నచ్చిన టైమ్‌, నచ్చిన ప్రోగ్రామ్స్‌ చూసే వీలుంది. ఈ టి.వి.ని ఇండియా, యు.ఎస్‌.ఎ., ఆస్ట్రేలియాలలో ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆఫీసులు హైదరాబాద్‌, చెన్నయ్‌లలో వుంటాయి. అమెరికన్‌ తెలుగు టి.వి.కి సంబంధించిన లోగో లాంచ్‌ సోమవారం హైదరాబాద్‌లోని నోవోటెల్‌ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ భగీరథ, అమెరికన్‌ తెలుగు టి.వి. అధినేత మధుసూదనరెడ్డి, పబ్లిసిటీ డిజైనర్‌ ధని ఏలే పాల్గొన్నారు. మధుసూదనరెడ్డి ‘అమెరికన్‌ తెలుగు టి.వి. లోగోను లాంచ్‌ చేశారు

Advertisement

 
Top