Menu


ఫిభ్రవరి 27న రామ్‌లీలా గ్రాండ్‌ రిలీజ్ యంగ్‌ హీరో హవీష్‌ (జీనియస్‌ఫేం) , హీరోయిన్ నందిత (ప్రేమకథాచిత్రం) కలయికలో వస్తున్న లవ్‌ఎంటర్‌టైనర్‌ రామ్‌లీలా సినిమా ఈ నెల 27న భారీగా రిలీజ్‌ అవుతుంది. దాదాపు 300 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆడియో రిలీజ్‌ నుంచే భీభత్సమైన హైప్‌ తో పాటు నిర్మాతలు చేసిన మోడ్రన్‌ పబ్లిసిటీతో సినిమా పై భారీ అంచనాలున్నాయి. హవీష్‌ కెరీర్‌లో రామ్‌లీలా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓపెనింగ్స్‌లో కూడా రామ్‌లీలా రికార్డ్స్‌ క్రియేట్ చేసే చాన్సుందని ట్రేడ్‌ పండితుల అంచనా. భారీ నిర్మాణ వ్యయంతో విజువల్‌ బ్యూటీతో సరికొత్త కథ కథనాలతో తెరకెక్కింది రామ్‌లీలా. కోనేరు సత్యనారాయణ సమర్పణలో రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన రామ్‌లీలా సినిమాతో శ్రీపురం కిరణ్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. చిన్నా సంగీత అందించిన ఈ సినిమా పాటలు సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి.

Advertisement

 
Top