Menu

‘కోటీశ్వరుడు’ ముగింపు కమల్ హాసన్ తో...
‘మా టీవి’ ప్రైమ్ టైమ్ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ముగింపు దశకు చేరుకుంది. వెండితెర ‘మన్మధుడు’ అక్కినేని నాగార్జున నిర్వహిస్తున్న ఈ షో ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు ప్రసారమవుతుంది. హీరో ‘కమల్ హాసన్’ ప్రత్యేక అతిధిగా ‘కోటీశ్వరుడు’ రెండవ సీజన్ ముగింపు ఎపిసోడ్ ప్రేక్షకులను అలరించనుంది. ఈనెల 27, శుక్రవారం రాత్రి 9.30 కు ‘కమల్’ తో రూపొందించబడిన ప్రత్యేక ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇలాంటి కార్యక్రమాల్లో అరుదుగా కనిపించే ‘కమల్’ ‘కోటీశ్వరుడు’ లో ప్రత్యక్షం కావడంతో ఈ మధ్యకాలంలో ‘కమల్ హాసన్’ ని తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గర చేసిన క్రెడిట్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కే దక్కుతుంది. 
మొదటి సీజన్ లో రేటింగ్స్ పరంగా భారీ విజయాల్ని సొంతంచేసుకున్న ఈ ‘కోటీశ్వరుడు’ కార్యక్రమం ప్రస్తుతం రెండవ సీజన్ లో కూడా విజయవంతంగా ప్రసారమవుతుంది. మొదటి సీజన్ తో పోలిస్తే రేటింగ్స్ పరంగా కొంచెం నిరుత్సాహపరచినప్పటికీ ప్రేక్షకులలో మాత్రం ఈ షో కి గల ఆధరణ ఏమాత్రం తగ్గలేదు.

Advertisement

 
Top