విక్టరీ వెంకటేశ్, మీనా
ప్రధాన పాత్రలుగా నటించిన ‘దృశ్యం’ సిల్వర్ స్క్రీన్ పై ఘనవిజయాన్ని సొంతం
చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. బుల్లితెరపై కూడా అదే ఘనవిజయాన్ని సొంతం
చేసుకుని ఈవారం అత్యధిక TRP రేటింగ్స్ తో దుమ్మురేపింది. ఈనెల
15 న సాయంత్రం 6 గంటల నుంచి జెమిని టీవి లో ప్రసారమైన ‘దృశ్యం’ 23.90 (TAM RATINGS ; GEC FEMAL 15+ MARKET)పాయింట్స్
ని సొంతం చేస్కోవడమే కాక WK8 లో
టాప్ చైర్ లో కూర్చుంది. హీరో వెంకటేశ్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో వున్న ఫాలోయింగ్,
వెంకటేశ్ – మీనా ల హిట్ కాంబినేషన్, వీటన్నిటికి తోడు ‘దృశ్యం’ సినిమా కథ, కథనంలో
వున్న టెంపో బుల్లితెర ప్రేక్షకులను టీవి ముందు నుంచి కదలకుండా చేసాయి. ఈ రేటింగ్స్ తో కొంతకాలంగా నెం 1 స్థానం కోసం కష్టపడుతున్న
జెమినీ టీవి రేసులో ముందుకు రావడానికి దోహదపడిందని చెప్పవచ్చు.