Menu

మంచు ఎంటర్ టైనర్ లో మరో ఎంటర్ టైనర్ ప్రొడక్షన్ నెం.౩
ఊ కొడతారా ఉలిక్కిపడాతారా గుండెల్లో గోదారి వంటి విభిన్న కథా చిత్రాలతో ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా అనతి కాలంలోనే పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మి మరో సరికొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. మంచు ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఫైవ్ ఎలిమెంట్స్ సంస్థతో కలిసి ప్రొడక్షన్ నెం.౩ని ప్రారంభించారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్ లోని ఓ ఇంట్లో ప్రారంభమైంది. దేవుడి చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శ్రీనివాస్ నాయుడు క్లాప్ నివ్వగా..మంచు లక్ష్మి భర్త ఆండి, పాప విద్యా నిర్వాణ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. తొలి షాట్ కు మంచు మనోజ్ గౌరవ దర్శకత్వం వహించారు. క్రైం కామెడీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వ శాఖలో పనిచేశిన ఎన్.వంశీకృష్ణ దర్శకత్వం  వహిస్తున్నారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి బి.శ్రీనికేత్ ఫొటొగ్రఫీ అందిస్తుండగా సత్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 

Advertisement

 
Top